: మైదానంలో నోరుజారాడు... ఒక టెస్టు నిషేధానికి గురయ్యాడు!


లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో ఒక మ్యాచ్ నిషేధానికి గుర‌య్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ బెన్‌స్టోక్స్‌‌ని ఔట్ చేసిన వెంట‌నే స‌ద‌రు బౌల‌ర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో క్రమశిక్షణ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన ఆయ‌న‌పై ఐసీసీ ఫైర్ అయింది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇటువంటి ప్ర‌వ‌ర్త‌నే క‌న‌బ‌ర్చిన ర‌బాడ అప్ప‌ట్లో నిబంధ‌న‌ల ఉల్లంఘించిన కార‌ణంగా మూడు డీమెరిట్ పాయింట్లకు గుర‌య్యాడు.

ఇక తాజా ప్ర‌వ‌ర్త‌న‌తో మ‌రో పాయింట్ క‌లిపిన బీసీసీఐ ఆయ‌న‌పై ఈ వేటు వేసింది. ఒక ఏడాదిలోనే నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే అటువంటి ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం వేసేలా 2016లో బీసీసీఐ నిబంధ‌న‌లు రూపొందించింది. నాలుగు డీమెరిట్ పాయింట్లు తెచ్చుకుని ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కున్న మొదటి ఆట‌గాడు డిక్వెల్లా కాగా, రెండ‌వ ఆట‌గాడిగా రబాడ నిలిచాడు.

  • Loading...

More Telugu News