: అసలైన ఫ్యాక్షనిస్టు చంద్రబాబే.. ఆటవిక పాలనకంటే చంద్రబాబు పాలనే డేంజరస్: పెద్దిరెడ్డి
రాష్ట్రంలో అసలైన ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉగాండా దేశంలో ఆటవిక పాలన కొనసాగిందని... కుట్ర, నయవంచనలతో కూడా చంద్రబాబు పాలన ఆ ఆటవిక పాలన కంటే భయంకరమైనదని తెలిపారు. బాబు పాలనలో ప్రజల మాన, ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ నేతలు చెబుతున్న వారినే ఎస్ఐలుగా నియమిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్లీనరీలో టీడీపీ ఆటవిక పాలనపై ఆయన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖట్జూ కూడా చంద్రబాబు పాలనపై ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. జగన్ నాయకత్వం రాష్ట్రంలో ఉండకూడదనే కారణంతోనే మన నేతలను డబ్బు పెట్టి కొనుగోలు చేశారని అన్నారు.