: భారత్‌కు వెళ్లే చైనీయులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన చైనా!
డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న చైనీయులతో పాటు, ఇక్కడికి వస్తున్న వారిని కూడా జాగ్రత్తగా ఉండాలని చైనా హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన రక్షణ పత్రాలను భారత్‌లోని చైనా విదేశీ కార్యాలయం జారీ చేసింది. ఒకవేళ అవసరమై బయటికి వెళ్లినా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చైనా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కొన్ని రోజులుగా చైనా, ఇండియా ఆర్మీల మధ్య సిక్కింలోని డోక్లాం ప్రాంతం వద్ద సరిహద్దు అంశంపై పరిస్థితులు ఉద్రిక్తంగా వున్నాయి. ఇదిలా ఉండగా, జీ20 సమావేశాల వద్ద భారత ప్రధానిని చైనా అధ్యక్షుడు కలవడం జరగదని చైనా మీడియా ప్రకటించినా ఇరు నేతలు శుక్రవారం కరచాలనం చేసుకుని, మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. వీరిరువురు డోక్లాం వివాదం గురించి మాట్లాడుకుని ఉంటారని అంచనా.