: మహేశ్‌తో అనుష్క ఐటెం సాంగ్?
మహేశ్ హీరోగా నటించనున్న `భరత్ అను నేను` సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ చేయనుందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే `సాహో' సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క నటించనుందనేది తెలిసిన విషయమే. ఇక మహేశ్‌తో ఐటెం సాంగ్ అంటే ఆమె అభిమానులకు పండగే. గతంలో మహేశ్‌తో కలిసి `ఖలేజా` సినిమాలో అనుష్క కథానాయికగా నటించింది. అలాగే, గతంలో `స్టాలిన్`లో చిరంజీవితో కలసి ఒక పాటలో మెప్పించిన అనుష్క, మహేశ్ సినిమాలో ఐటెం సాంగ్ స్థాయిని ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో మరి!