: కాలేజీ భవనంపై నుంచి దూకి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షేర్‌గూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు కలకలం చెలరేగింది. వెంకట చైతన్య అనే మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి కాలేజీ భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేశాడు. రక్తమోడుతున్న ఆ విద్యార్థిని వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చైతన్య ప్రాణాలు కోల్పోయాడు. అతడి కాళ్లు, చేతులతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. చైతన్యను హెచ్‌ఓడీ మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి స్నేహితులు చెబుతున్నారు.