: నా కుమారుడి వర్ధంతి రోజున రక్తపాతం వద్దు: హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి
తన కుమారుడి వర్ధంతి రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని, రక్తపాతం సృష్టించవద్దని హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి కశ్మీర్ యువతను కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని పంపారు. గత ఏడాది జూలై 8వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో వనీని భారత సైనికులు కాల్చి చంపారు. అతని మృతితో కశ్మీర్ లోయ 53 రోజుల పాటు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయింది. బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కశ్మీర్ లోయలోని అనంతనాగ్, షోపియాన్, బారాముల్లా, సోపూర్, త్రాల్ తదితర పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.