: 71 ఏళ్ల బామ్మను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల బాలుడు!
ఇండోనేషియాలో విచిత్రమైన పెళ్లి జరిగింది. 16 ఏళ్ల బాలుడు 71 ఏళ్ల వృద్ధురాలిని వివాహమాడాడు. వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు. ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ బాలుడి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా, ఆ బామ్మ ఇంట్లోని కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి ఆ జంట ఒక్కటైంది. ప్రేమకు కులము, మతమే కాదు పెళ్లి కూతురు తన కంటే 55 ఏళ్లు పెద్దదయినా అడ్డుకాబోదు అంటూ నిరూపించి, ఆ 16 ఏళ్ల వరుడు చివరకు తన ప్రేమలో విజయం సాధించాడు. ఆ దేశంలోని నైరుతి సుమత్రా, కరన్‌గెండా గ్రామంలో ఈ వింత వివాహం జరిగింది. వరుడి పేరు సేలమత్ రియాది కాగా, 71 ఏళ్ల వధువు పేరు రోహయా. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. తమ ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వధూవరులిద్దరూ ఏకమయ్యారు.