: ఆసక్తి కలిగిస్తున్న బిగ్‌బాస్ కొత్త ప్రోమో... రెండు గంటల్లో 40 వేల హిట్లు
జూలై 16 నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్ కొత్త ప్రోమోను విడుదల చేశారు. బిగ్‌బాస్ కార్యక్రమ వివరాలను వెల్లడించడానికి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో సెలబ్రిటీలు ఏం చేయబోతున్నారనే విషయాన్ని వారి ముఖాలు కనిపించకుండా ఈ ప్రోమోలో లైట్ గా చూపించారు. 70 రోజులు, 61 కెమెరాల మధ్య నివసించబోయే 12 మంది సెలబ్రిటీలు ఆ వసతి గృహంలో ఇల్లు తుడవడం, బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, వంట చేసుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ఈ ప్రోమో ద్వారా అర్థమవుతోంది. ఈ నెల 13 నుంచి ముంబై సమీపంలోని లోనోవాలా ప్రాంతంలో నిర్మించిన బిగ్‌బాస్ గృహంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా, ఇందులో పాల్గొనబోయే సెలబ్రిటీలు ఎవరనే విషయంపై మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.