: ఢిల్లీలో తెలుగు విద్యార్థి కిడ్నాప్ కలకలం...5 కోట్లు డిమాండ్
ఢిల్లీలో తెలుగు విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే విద్యార్థి ఢిల్లీలో నివాసం ఉంటూ మెట్రో మెడికల్ కళాశాలలో వైద్య విద్యలో పీజీ విద్యనభ్యసిస్తున్నాడు. శ్రీనివాస్ ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, 5 కోట్ల రూపాయలు ఇస్తే వదిలేస్తామని బెదిరింపులకు దిగాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ప్రీతివిహార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.