: రెమ్యూనరేషన్ మీరు చెప్పేంత కాదు...కానీ ఫర్వాలేదు: జూనియర్ ఎన్టీఆర్


బిగ్ బాస్ రియాలిటీ షోకు తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని కథనాలు వచ్చాయని జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేశాడు. తన భార్యాబిడ్డల్ని చూసుకునేంత డబ్బు ఇప్పటికే తన వద్ద ఉందని చెప్పాడు. అయితే ఈ షో కోసం రెమ్యూనరేషన్ మాత్రం మీడియా చెబుతున్నంత ఎక్కువ ఇవ్వలేదని అనుకుంటానని తెలిపాడు. ఇంతవరకు రెమ్యూనరేషన్ గురించి ఏనాడూ పెద్దగా ఆలోచించలేదని, మీడియా ప్రతినిధులు అడుగుతుంటే ఈ సారి రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోవాలని అనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. బిగ్ బాస్ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదని, అంతకంటే మంచి అనుభవమని, అందుకే సరికొత్త ఛాలెంజ్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News