: సవాళ్లంటే నాకు చాలా ఇష్టం : జూనియర్ ఎన్టీఆర్


తనకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. బిగ్ బాస్ లాంచింగ్ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ,  'నాకు టీవీల్లో నటించడం రాదు, ఎలా మాట్లాడాలో కూడా పెద్దగా తెలియదు. ఇప్పుడు ఈ సరికొత్త సవాలును స్వీకరించాను. స్టార్ మా నన్ను సంప్రదించినప్పుడు బాగా ఆలోచించాను. దీని నుంచి నేర్చుకునేందుకు ఎన్నో అవకాశాలుంటాయని భావించి, ఈ ఆఫర్ ను అంగీకరించాను" అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.

ఈ ప్రయత్నం విజయవంతమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఆఫర్ ను అంగీకరించేందుకు రఘు కారణమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. హిందీ బిగ్ బాస్ చూడలేదు కానీ తన కజిన్ సిస్టర్ బాగా చూస్తుందని చెప్పాడు. ఒకరోజు సల్మాన్ కంటెస్టెంట్స్ ని తిట్టేశాడని తన కజిన్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని... అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ షో చూడడమే కానీ, ప్రత్యేకంగా చూసిందేదీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News