: సినిమా, మోడలింగ్ ఆశలు ఆవిరి కావడంతో పాతబస్తీలో యువతి ఆత్మహత్య


సినిమా,మోడలింగ్ లపై ఆశలు ఆవిరి కావడంతో పాతబస్తీలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదులోని బహుదూర్ పురాకు చెందిన హజ్రా సుల్తానా (20) కు మోడలింగ్, సినిమాల్లో నటిగా రాణించాలని కోరిక. ఈ నేపథ్యంలో తన కోరికలు నెరవేర్చుకోవాలంటే హైదరాబాదులో ఉండడం కంటే ముంబై వెళ్లాలని భావించిన హజ్రా సుల్తానా బాయ్ ఫ్రెండ్ సాయంతో ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం ఆమె కోసం గాలించిన తల్లిదండ్రులు తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను పోలీసులకు అప్పగించాడు. దీంతో ఆమెను విచారించగా ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో నాలుగు గంటలపాటు తల్లిదండ్రుల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అన్నిరకాలుగా నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే యువతి సినిమాల్లో నటిస్తానని, మోడలింగ్ చేస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో సుల్తానా ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో, సుల్తానా చావుకు కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించగా, తాను యువతికి అందించాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించానని, తల్లిదండ్రులే ఆమె చావుకి కారణమని బాయ్ ఫ్రెండ్ ఆరోపించాడు. 

  • Loading...

More Telugu News