: కాసేపట్లో వైసీపీ ప్లీనరీ ప్రారంభం.. ఈ రోజు కార్యక్రమాల వివరాలు!


వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్లీనరీ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపట్లో జగన్ ఇడుపులపాయ నుంచి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు.

వైసీపీ ప్లీనరీ తొలిరోజు అజెండా ఇదే...
  • ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం.
  • 10.30 నుంచి 11.15 గంటల వరకు కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం.
  • 11 గంటల నుంచి 11.15 వరకు జగన్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. అనంతరం ప్రార్థన.
  • 11.15 నుంచి 11.30 వరకు పార్టీ కీలక నేతలను వేదిక పైకి ఆహ్వానించే కార్యక్రమం.
  • 11.30 నుంచి 11.45 వరకు వందేమాతరంతో పాటు, కొన్ని గీతాలాపనలు.
  • 11.45కు దివంగత వైయస్సార్ కు నివాళి.
  • 11.50 గంటలకు సర్వమత ప్రార్థనలు.
  • మధ్యాహ్నం 12 నుంచి 12.10 వరకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన, పార్టీ ప్రతినిధుల ప్రమాణం.
  • 12.10 నుంచి 12.25 వరకు దివంగత పార్టీ నేతలకు నివాళి.
  • 12.25 గంటల నుంచి 12.55 వరకు జగన్ ప్రారంభోపన్యాసం.
  • 12.55 నుంచి 1.10 వరకు పార్టీ జమ, ఖర్చుల ఆడిట్ స్టేట్ మెంట్ ప్రతిపాదన, ఆమోదం.
  • 1.10 నుంచి 1.20 వరకు పార్టీ నియమావళి సవరణలు.
  • 1.20 నుంచి 1.30 వరకు విరాళాలు కోరుతూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి.
  • 1.30 నుంచి 3.45 వరకు పలు అంశాలపై ప్రతిపాదనలు, చర్చ, తీర్మానాలు.
  • 3.45 గంటలకు 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకావిష్కరణ.
  • 4.10 గంటలకు పార్టీ ఫిరాయింపులు, పార్టీ శ్రేణులపై దాడులపై చర్చ.
  • 4.35 నుంచి 5.50 వరకు డ్వాక్రా మహిళలు, కాపు రిజర్వేషన్లు, సోషల్ మీడియా పాత్ర, నెటిజన్లపై కక్ష సాధింపు చర్యలపై చర్చ.
  • 5.50 నుంచి 5.55 వరకు అధ్యక్ష ఎన్నికల తుది జాబితా ప్రకటన.                        

  • Loading...

More Telugu News