: ఇడుపులపాయలో వైయస్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ ఘన నివాళి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతి నేడు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైయస్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిలు ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు.