: కాసేపట్లో మీడియా ముందుకు జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ షో లాంచింగ్ కార్యక్రమం!


ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కాసేపట్లో మీడియా ముందుకు రానున్నాడు. తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ టీవీషో ఈ నెల 16 నుంచి ఒక టీవీ చానెల్ లో ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షోకు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాలిటీ షో లాంచింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

 ఈషోలో వ్యాఖ్యాతగా ఉన్న తారక్ షోతో పాటు, కంటెస్టెంట్ లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కన్నడతో పాటు తమిళంలో కూడా బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. ఈ షోను తాజాగా తెలుగులోకి తీసుకురావాలని కలర్స్ టీవీ ఛానెల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

  • Loading...

More Telugu News