: బీజేపీ నాయకులూ! దళిత యువకులకు మీ ఇంటి అమ్మాయిలను ఇవ్వండి: సీఎం సిద్ధరామయ్య సలహా
దళితులపై బీజేపీ నాయకులకు నిజమైన ప్రేమ ఉంటే కనుక, వారి ఇంట్లో అమ్మాయిలను దళిత యువకులకు ఇచ్చి పెళ్లి చేయాలని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సవాల్ విసిరారు. కిత్తగనూరులో 65 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం, మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని దళితుల ఇళ్లల్లో తింటూ, వారిపై ప్రేమ ఉన్నట్టుగా బీజేపీ నాయకులు నటించడం సబబుకాదని అన్నారు. ఓట్ల కోసమే వారి ఇళ్లలో బీజేపీ నాయకులు భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. దళిత యువతులను బీజేపీ నేతల కుటుంబాల్లోకి కోడళ్లుగా తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.