: రెవెన్యూ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలలో పోస్టుల‌ భర్తీకి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ!


తెలంగాణ రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయా పోస్టుల వివ‌రాలు ప్ర‌క‌టించింది. తెలంగాణ రాష్ట్ర‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. రెవెన్యూ శాఖలో మొత్తం 1506 పోస్టులు, గ్రామీణ నీటి సరఫరా శాఖలో 359 ఇంజనీర్ పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నుంది.

 రెవ‌న్యూ శాఖ‌లో భ‌ర్తీకానున్న ఖాళీల వివ‌రాలు..                
  •  వీఆర్వో పోస్టులు- 700
  •  జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులు- 400
  •  డిప్యూటీ సర్వేయర్లు  210
  •  జూనియర్ అసిస్టెంట్లు-50
  •  కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్ పోస్టులు-50
  •  డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు-8
  •  డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు-38
  •  సబ్ రిజిస్ట్రార్ పోస్టులు-22

 తెలంగాణ‌ గ్రామీణ నీటి సరఫరా శాఖలో భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వివ‌రాలు..                
  •  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్- 277
  •  అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు- 82

  • Loading...

More Telugu News