: ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు !
గుంటూరులో ఈ రోజు నిర్వహించాల్సిన ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర మహాసభకు ప్రభుత్వం అనుమతి లభించకపోవడం, సీఎం చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు కృష్ణమాదిగ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దులోని అనుమంచుపల్లి వద్దకు ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు. ఏపీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నపోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కాగా, విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.