: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: ఈ నెల నుంచే 7వ సీపీసీ అమలు
గతనెలలో ఆమోదించిన 7వ పే కమిషన్ భత్యాలను జూలై 1, 2017 నుంచే అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు కొత్త నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని సూచించింది. దీని ద్వారా 35 లక్షల మంది సివిల్ ఉద్యోగులు, 14 లక్షల మంది డిఫెన్స్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అలాగే కేంద్రంపై అదనంగా రూ. 30,748 కోట్ల రూపాయల భారం పడనుంది. నిజానికి 7వ పే కమిషన్ సూచించిన భత్యాల వల్ల కేంద్రంపై రూ. 29,300 కోట్ల భారం పడాల్సి ఉంది. కానీ కొన్ని మార్పుల తర్వాత ఈ భారం రూ. 1448 కోట్లు పెరిగింది. ఇందులో ఉద్యోగి స్థాయిని బట్టి డీఏ చెల్లింపుల్లో మార్పులు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే వారికి పెంచిన చెల్లింపులు అధికంగా ఉన్నాయి.