: ప్రయోగదశలో ‘ఫేస్ బుక్’ సొంత యాప్ ‘బోన్ ఫైర్’!


ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ సొంతగా తయారు చేసుకున్న గ్రూప్ వీడియో చాట్ యాప్ ‘బోన్ ఫైర్’ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నట్టు తెలుస్తోంది. హౌస్ పార్టీ యాప్ ను రూపొందించిన ఆలోచనల ఆధారంగా తమ సొంత యాప్ ను ‘ఫేస్ బుక్’ తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ ను ‘ఫేస్ బుక్’ ఉద్యోగులకు ఇటీవలే డిమాన్ స్ట్రేట్ చేసినట్టు సమాచారం.

‘బోన్ ఫైర్’తో పాటు ‘టాక్’ అనే మరో యాప్ ను టీనేజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారని సమాచారం. ‘టాక్’ వీడియో చాట్ ద్వారా టీనేజర్లు తమ గ్రాండ్ పేరెంట్స్ తో సంభాషించే నిమిత్తం వారిని ప్రోత్సహించేందుకు దీనిని రూపొందించారు. అంతేకాకుండా, ఈ యాప్ ద్వారా తమ పిల్లలు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారో వారిని అదుపులో పెట్టే అవకాశం పిల్లల తల్లిదండ్రులకు ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News