: ఏకంగా 115 కిలోల బరువు తగ్గిన ప్రముఖ కొరియోగ్రాఫర్


ప్రముఖ కొరియాగ్రాఫర్ గణేష్ ఆచార్య శ్రమకు ఫలితం దక్కింది. భారీ కాయంతో నిన్న మొన్నటి వరకు కనిపించిన గణేష్ ఏకంగా 115 కిలోల బరువు తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు శ్రమించిన తర్వాత తన శరీరం ఇలా మారిందని చెప్పాడు. 200 కేజీల బరువు నుంచి 85 కిలోలకు తగ్గానని తెలిపాడు. ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా డ్యాన్స్ చేయగలుగుతున్నానని చెప్పాడు. తన కొత్త వీడియోలను యూట్యూబ్ లో పెడతానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News