: జగన్ మరోసారి ఆలోచిస్తే మంచిది: డీప్యూటీ సీఎం కేఈ
నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుందని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కోరారు. ప్రజాప్రతినిధి మరణించినప్పుడు, వారి కుటుంబసభ్యులు పోటీచేస్తే, పోటీకి నిలపకపోవడమనే ఆచారాన్ని గత కొన్నేళ్లుగా పాటిస్తూ వచ్చామని... ఇప్పుడు కూడా అదే ఆచారాన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పారు. అవినీతి కేసులను ఎదుర్కొంటున్న జగన్ పార్టీలోకి శిల్పామోహన్ రెడ్డి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ రోజు నంద్యాల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేఈ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీకి మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు కూడా హాజరయ్యారు.