: ఎందుకీ మౌనం?... చైనా చర్యలపై మోదీని మరోసారి ప్రశ్నించిన రాహుల్ గాంధీ
సరిహద్దు ప్రాంతంలో చైనా పాల్పడుతున్న చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఈ రోజు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘చైనా విషయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆయన నిలదీశారు. ఇటీవలే ట్రంప్ తో భేటీ అయి హెచ్-1 బీ వీసాల గురించి చర్చించని మోదీనీ రాహుల్ గాంధీ 'ఓ బలహీన వ్యక్తి' అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.