: నా ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకుందోచ్!: రకుల్ ప్రీత్ సింగ్ సంబరం
టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఏ విషయమైనా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ, తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటుంది. తాను నటిస్తోన్న సినిమా విశేషాలు, తాను సందర్శించిన ప్రాంతాలు, కొత్త సినిమాలు, వాటి ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఆకట్టుకుంటోంది. సమాజంలో ఆడవారిపై జరిగే దారుణాలను కూడా రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఖండిస్తోంది. తాజాగా ఈ అమ్మడిని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య పది లక్షలకు చేరింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడు తన ట్విట్టర్ ఫ్యామిలీ మెంబర్ల సంఖ్య మిలియన్‌కు చేరుకుందని, తనను అభిమానిస్తోన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ అమ్మడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.