: ‘రంగస్థలం’లో కొత్త చరణ్ ని చూస్తారు: దర్శకుడు సుకుమార్


‘రంగస్థలం 1985’ లో కొత్త చరణ్ ని చూస్తారని ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులు, రామ్ చరణ్ అభిమానులు మెచ్చే విధంగా ఈ చిత్రంలో చెర్రీ నటన ఉంటుందని, తను చాలా చాలా బాగున్నాడని చెప్పారు. త్వరలోనే మహేశ్ బాబుతో ఓ చిత్రం చేయనున్నానని చెప్పిన సుకుమార్, జూనియర్ ఎన్టీఆర్ తో తాను తీసే చిత్రం వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కాగా, ‘రంగస్థలం 1985’ లో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.

  • Loading...

More Telugu News