: పీవీ సింధు, పుల్లెల గోపిచంద్‌లకు స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మేగజైన్ అవార్డులు
భారత షట్లర్ పీవీ సింధు, కోచ్ గోపిచంద్‌లకు ముంబైకి చెందిన స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మేగజైన్ అవార్డులు ప్రదానం చేసింది. సింధుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, గోపిచంద్‌కి కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అందజేసింది. అలాగే మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్‌కు లివింగ్ లెజెండ్ అవార్డు, ఒలింపిక్ స్వర్ణ పతక గ్రహీత అభినవ్ బింద్రాకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను మేగజైన్ ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టు టెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కు గేమ్‌ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఇంకా జూనియర్ ఇండియన్ హాకీ జట్టుకు టీం ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందజేశారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి నటి తాప్సీ హాజరయ్యారు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం గెల్చిన తర్వాత ఈ ఏడాది ప్రథమాంకంలో సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, ఇండియా ఓపెన్ టైటిళ్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.