: నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సామాజికవేత్త శ్రీమన్నారాయణ
తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజికవేత్త పండలనేని శ్రీమన్నారాయణ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తారా? అని ఆయన మండిపడ్డారు. పోలీసుల అరెస్ట్ లకు తాను భయపడేది లేదని... అవసరమైతే జైల్లో ఉండే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. అమరావతి భూముల విషయాన్ని 70 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని... వారందరిపై కేసులు పెట్టగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలపై కోర్టుకు వెళ్లే అధికారం తమకు ఉందని... తప్పుడు కేసులు పెట్టినా భయపడమని, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.