: 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో మోటో ఈ4 ప్లస్
అత్యధిక బ్యాటరీ సామర్థ్యం గల మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జూలై 12 అర్ధరాత్రి నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని మోటో ఇండియా వారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతర్జాతీయంగా జూన్‌లో విడుదల చేసిన మోటో ఈ4తో పోల్చినపుడు దీని బ్యాటరీ సామర్థ్యం దాదాపు రెండింతలు. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల రెడ్‌మీ 4 నుంచి పోటీని తట్టుకోవడానికే 5000 ఎంఎహెచ్ సామర్థ్యంతో మోటో ఈ4 ప్లస్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32జీబీ వరకు పెంచుకోగల మెమరీ, 13 మెగాపిక్సల్స్‌తో వెనక కెమెరా, ముందు కెమెరా 5ఎంపీతో పాటు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టం ఉన్నాయి. దీని ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు.