: కత్రినా నన్ను బాగా ప్రభావితం చేస్తుంది: రణ్‌బీర్

వ్యక్తిగత వ్యవహారాలు సినిమా నిర్మాణంపై ప్రభావం చూపించకూడదన్న విషయం తనకు, నటి కత్రినా కైఫ్‌కు బాగా తెలుసని, ఆమె తన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తోందని రణ్‌బీర్ కపూర్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `కత్రినాకు, మీకు మధ్య ఏర్పడిన స్పర్థలు మీ సినిమాపై ఏమైనా ప్రభావం చూపించాయా?` అని అడగ్గా - `వ్యక్తిగత విషయాలను సెట్ వరకు తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు. నా మూడో సినిమా అజమ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ` నుంచి కత్రినాతో నటిస్తున్నాను. మా మధ్య సంబంధం గురించి మీడియా ఏం రాసుకున్నా మాకు మాత్రం దానిపై ఓ క్లారిటీ ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కత్రినా నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆమె లాంటి వాళ్లు నా జీవితానికి అవసరం. ఇక ముందు కూడా ఆమె అలాగే ఉంటుందని కోరుకుంటున్నా` అని వివరించారు రణ్‌బీర్. అనురాగ్ బసు దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించిన `జగ్గా జాసూస్` సినిమా జూలై 14న విడుదల కానుంది.