: ఆగస్ట్ 11న 'నేనే రాజు నేనే మంత్రి'
తేజ దర్శకత్వంలో రానా, కాజల్ జంటగా నటించిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. కేథరీన్ త్రెసా కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. బాహుబలి 2 తర్వాత రానా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ భారీ అంచనాలు పెట్టుకుంది.