: బ్యూటీషియన్ శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారు: నిర్ధారించిన పోలీసులు
హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరిదీ ఆత్మహత్యేనని పోలీసులు తెలిపారు. ఇద్దరూ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రారంభం నుంచి తాము ఆత్మహత్యలేనని చెబుతున్నామని, టెక్నికల్ ఎవిడెన్స్ లు, ఇతర ఆధారాలు చూసిన తరువాతే తాము వీటిని ఆత్మహత్యలుగా నిర్ధారించామని వారు తెలిపారు.
తమ వాదనను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నిర్ధారించిందని చెప్పారు. శిరీష ఆల్కహాల్ తీసుకుందని తెలిపారు. లోదుస్తులపై మరకల గురించి మాట్లాడడం సభ్యత కాదని చెప్పారు. వైద్య నివేదికను శిరీష కుటుంబ సభ్యులకు ఇస్తామని అన్నారు. ఇంకా తమపై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. అలా కాకుండా వారి దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని సూచించారు.