: సుప్రీంకోర్టులో విచారణకు రానున్న అమరావతి కేసు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూ సేకరణ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసును వేశారు. 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని... మూడు పంటలు పండుతున్న భూములను నోటిఫై చేయకుండానే, భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఆర్కే తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం విచారించనుంది.