: ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో స్మృతి ఇరానీ హాస్యచ‌తుర‌త‌!


సోష‌ల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అంద‌రూ షేర్ చేస్తారు, కానీ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాత్రం వాటికి కొంచెం హాస్యాన్ని కూడా జోడిస్తారు. ఆమె షేర్ చేసిన ఫొటో కంటే దానితో పాటు రాసిన పోస్టే త‌న హ‌స్య‌చ‌తుర‌త‌కు నిద‌ర్శ‌నం. హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ బిల్లింగ్ లో తాను పారాగ్లైడింగ్ చేసిన వీడియో ఒక‌టి స్మృతి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. దానితో రాసిన పోస్ట్ మాత్రం నెటిజ‌న్ల‌కు బాగా న‌చ్చేసింది.

'భార‌త‌దేశ పారాగ్లైడింగ్ రాజ‌ధాని బిర్ బిల్లింగ్ నుంచి గ్లైడ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యా... కొంత‌మంది అనుకోవ‌చ్చు...నేను మ‌ళ్లీ భూమ్మీదికి రావ‌డం చాలా సులువ‌ని` (లావుగా ఉండ‌టం వ‌ల్ల ల్యాండింగ్ సులువని ఆమె ఉద్దేశం) అని స్మృతి పోస్ట్ చేశారు.

త‌న శ‌రీరాకృతి గురించి స్మృతి పోస్ట్ చేయ‌డం ఇదేమీ మొద‌టిసారి కాదు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌ను యోగా చేస్తున్న ఫొటో పెట్టి `లావుగా ఉన్న‌వాళ్లు శ‌రీరాన్ని వంచ‌లేర‌ని ఎవ‌రు చెప్పారు?` అంటూ పోస్ట్ చేశారు. ఏదేమైనా స్మృతి హాస్యచ‌తుర‌త చూసి నెటిజ‌న్లంతా `మీరు కూలెస్ట్ యూనియ‌న్ మినిస్ట‌ర్` అని పొగిడేస్తున్నారు.

  • Loading...

More Telugu News