: గుంటూరులో 144 సెక్షన్... నిబంధనలు ధిక్కరిస్తే కఠిన చర్యలు: అర్బన్ ఎస్పీ


గుంటూరులో 144 సెక్షన్ విధించినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు. ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఎస్టీల వర్గీకరణకు అనుకూలంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వరంలో గుంటూరులో నేడు కురుక్షేత్రం పేరిట భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సభకు వెళ్లేందుకు మాదిగలు ఏర్పాట్లు చేసుకోగా, వారు సభను నిర్వహించాలని నిర్ణయించిన వేదికకు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసేశారు. శాంతిభద్రతల కారణంగా సభకు అనుమతినివ్వలేదని తెలిపారు. జగ్గయ్యపేటలో 300 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పలుచోట్ల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News