: యాంకర్ సోనికా మృతి కేసులో బెంగాలీ యువ నటుడు విక్రమ్ చటర్జీ అరెస్ట్


బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతికి సంబంధించి, యువ హీరో విక్రమ్ చటర్జీని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. అతి వేగంతో కారు నడిపి సోనికా మృతికి కారణమయ్యాడని ఇప్పటికే విక్రమ్ పై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదై ఉంది. గడచిన ఏప్రిల్ 29న వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరూ కలసి మందు కొట్టారు. ఆపై కారులో తిరిగి వస్తున్న వేళ, మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి పల్టీలు కొట్టి ఫుట్ పాత్ పైకి వెళ్లి, ఓ దుకాణాన్ని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనం నడుపుతున్న విక్రమ్ మద్యం తాగి ఉన్నాడని తేలడంతో, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పార్టీలో ఉన్న వేళ మద్యం తాగుతూ తీసుకున్న ఫోటోలను స్నేహితులకు విక్రమ్ షేర్ చేయగా, అవే ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. పైగా, కారును అతివేగంగా నడపటం కూడా సోనికా మరణానికి కారణమైంది. కాగా, విక్రమ్ పై అభియోగాలు రుజువైతే 2 నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్ష పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News