: 'భరతమాత'పై వ్యాఖ్యల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాదులో పోలీస్ కేసు నమోదైంది. తాజాగా పాతబస్తీలో నిర్వహించిన బహిరంగ సభలో భరతమాతకు హిందువులు తిలకం దిద్దితే... మనం టోపీ పెడదాం అంటూ చేసిన వ్యాఖ్యలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కరుణా సాగర్ అనే న్యాయవాది సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఫిర్యాదులో కోరారు. దీంతో అక్బరుద్దీన్ పై సైదాబాద్ పోలీసులు 121, 121(ఏ), 153 (ఏ), 153 (బి), 500, 505, 511, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.