: ముఖం చూసి వారు ధనవంతులో కాదో చెప్పేయొచ్చు: శాస్త్రవేత్తల ఆసక్తికర పరిశోధన


మనకు పరిచయమైన వ్యక్తి ధనవంతుడా? కాదా? అన్న విషయాన్ని మన మెదడు సులువుగానే పట్టేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. టొరంటో యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు తొరా జార్న్స్ డాటిర్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ముఖాన్ని గుర్తుపట్టేందుకు ప్రతి వ్యక్తి మెదడులో కొన్ని న్యూరాన్లుంటాయని, ఎవరినైనా కలిసినప్పుడు ఎవరైనా ముందు ముఖమే చూస్తారని ఆయన తెలిపారు. ఎదుటి వ్యక్తి నవ్వుతున్నప్పుడో లేక ఏదైనా భావాలు పలికిస్తున్నప్పుడో కాకుండా సాధారణంగా ఉంటేనే వాళ్ల విషయాలు మనకు తెలుస్తాయని ఆయన చెప్పారు. డబ్బున్నవారైతే సంతృప్తికరంగా కనిపిస్తారని ఆయన అన్నారు.

ఈ మేరకు సగటున ఏడాదికి 48 లక్షల రూపాయల ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని పరిశోధన చేసినట్టు ఆయన తెలిపారు. ఏడాదికి 39 లక్షల రూపాయల లోపు, 48 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే కొంత మంది వ్యక్తుల ఫోటోలు తీసుకున్నారు. వారిని ఎలాంటి భావం పలికించవద్దని సూచించి, ఆ ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు పలువురికి చూపించి వాటిల్లో ధనవంతులెవరు? ధనవంతులు కానివారెవరు? అని అడుగగా, సుమారు 53 శాతం మంది కచ్చితత్వంతో సరైన సమాధానం చెప్పారని వెల్లడించారు. దీనిని బట్టి ముఖాన్ని చూసి వారు ధనవంతులా? కాదా? అన్నవిషయాన్ని మనిషి ఇట్టే పట్టేస్తాడని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News