: అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి లకు ఈడీ కోర్టు సమన్లు
అక్రమాస్తుల కేసులో జగన్ కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ చార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న విచారణకు హాజరుకావాలని జగన్ కు పంపిన సమన్లలో ఆదేశించింది. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ కూ సమన్లు జారీ అయ్యాయి. వీరు కూడా అదే రోజున కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.