: మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్!
భారత్, వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న విండీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో షాయి హోప్ (22), మొహమ్మద్ (1) ఉన్నారు. విండీస్ ఓపెనర్ లెవిస్ 9 పరుగులకే అవుట్ కాగా, మరో ఓపెనర్ కైలీ హోప్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఇక చేజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, హార్థిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం వెస్టండీస్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 19 ఓవర్లకి 85గా ఉంది.