: తల్లిదండ్రులు తమ్ముడికే సపోర్ట్ చేస్తున్నారని... కనిపించకుండా వెళ్లిపోయిన బాలుడు
తమ ఇంట్లో అందరూ తన తమ్ముడినే బాగా చూసుకుంటున్నారని అలిగిన ఓ బాలుడు ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని దుర్గా ఎన్‌క్లేవ్‌లో చోటు చేసుకుంది. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు చూస్తే అశోక్‌దాస్ అనే బాలుడు స్థానిక సెయింట్ అగస్టీన్ హైస్కూల్లో 7వ తరగతి విద్యార్థి. అశోక్‌దాస్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. వారిద్దరికీ కలిపి తల్లిదండ్రులు ఒకే సైకిల్ కొనిచ్చారు. అయితే, కొన్ని రోజులుగా అశోక్ తన తమ్ముడితో సైకిల్ విషయమై గొడవపడుతున్నాడు. తన తల్లిదండ్రులు కూడా తన తమ్ముడికే సపోర్ట్ చేస్తున్నారని అశోక్ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.