: ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశం.. ఎంతో మందిని కిరాతకంగా చంపేసింది: కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టిస్తోన్న నేప‌థ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ దేశంపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇజ్రాయెల్ ఒక‌ ఉగ్రవాద దేశమని ఆయ‌న ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఎంతో మందిని కిరాతకంగా చంపేసిందని అన్నారు. అటువంటి ఇజ్రాయెల్‌తో ఉగ్రవాద వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసుకోవడం స‌రికాద‌ని చెప్పారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ కిరాత‌కాలు చేస్తోందని, అమాయకులపై ఉగ్రవాదులనే ఆరోపణలను మోపి, చంపేస్తోంద‌ని అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి ఇజ్రాయెల్ ద్రోహం చేస్తోందని విమర్శించారు. అటువంటి దేశంతో ఇటువంటి ఒప్పందాలెందుక‌ని ప్ర‌శ్నించారు.           

  • Loading...

More Telugu News