: టీమిండియాతో చివ‌రివ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌


వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఈ రోజు చివరి వ‌న్డే ఆడుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌న్డేల్లో భార‌త్ రెండింట్లో విజ‌యం సాధించ‌గా వెస్టిండీస్ ఒక్క మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం అయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భార‌త్ సిరీస్‌ను కైవ‌సం చేసుకుంటుంది. ఒక వేళ వెస్టిండీస్ గెలిస్తే ఈ సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను గెలుచుకోవాల‌ని భారత్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ సిరీస్‌లో మొద‌టి వ‌న్డేల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా నాలుగో వన్డేలో మాత్రం విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News