: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరు: గద్దర్ ఆవేదన


పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రజా గాయకుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో ‘జై సామాజిక తెలంగాణ’ ఉద్యమాన్నిఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ, అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యంపై కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆ సౌకర్యాలు ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని, నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గ్రామీణ విలేకర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని గద్దర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News