: సరూర్ నగర్ లో దారుణానికి పాల్పడ్డ వడ్డీ వ్యాపారుల్లో ఒకరి అరెస్టు
హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో అప్పు తీర్చడం లేదంటూ ఓ వ్యక్తిని వడ్డీవ్యాపారులు దారుణంగా కొట్టడం, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి మీడియా ద్వారా బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన సరూర్ నగర్ పోలీసులు సదరు వడ్డీ వ్యాపారుల్లో ఒకరైన దేవేందర్ రెడ్డిని అరెస్టు చేశారు.
కాగా, వడ్డీ వ్యాపారులు దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి వద్ద నుంచి గతంలో రూ.2 లక్షలు అప్పుగా జయశంకర్ తీసుకున్నారు. అయితే, ఆయన తీసుకున్న దాని కంటే ఎక్కువగా.. రూ.5 లక్షలు వారు వసూలు చేశారు. మరో రెండు లక్షలు ఇవ్వాలంటూ జయశంకర్ పై దాడికి పాల్పడ్డారు. దేవేందర్ రెడ్డి, జంగారెడ్డి లిద్దరూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులని సమాచారం.