: హైదరాబాద్ లో భారీ వర్షం... నత్తనడకన సాగుతున్న వాహనాలు


హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. మెహిదీప‌ట్నం, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, మాదాపూర్‌ల‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. పంజాగుట్ట‌, ఎస్సార్‌న‌గ‌ర్‌, యూసఫ్ గూడ‌, నాంపల్లి, గోషామ‌హ‌ల్, ఛాద‌ర్‌ఘాట్, మ‌ల‌క్‌పేట్‌, స‌రూర్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌ ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షం పడుతోంది. సికింద్రాబాద్‌, రాణిగంజ్‌, బేగంపేట‌, మారేడుప‌ల్లి, తిరుమ‌లగిరి, బ‌న్సీలాల్‌పేట్‌, ఉప్ప‌ల్, రామాంతపూర్‌, బోడుప్ప‌ల్, చందాన‌గ‌ర్‌, కాప్రా, కుషాయిగూడ‌, సైనిక్‌పురి, కోఠి, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, నారాయ‌ణ గూడ‌, బోయిన్‌ప‌ల్లి, దిల్‌సుఖ్ న‌గ‌ర్‌ ప్రాంతాలతో పాటు ప‌లుచోట్ల‌ వాన ప‌డుతోంది. వ‌ర్షం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న ముందుకు సాగుతున్నాయి.  

  • Loading...

More Telugu News