: ‘వావ్’... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా టీజర్‌పై రాజమౌళి, సాయిధరమ్ తేజ్ స్పందన!
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవ కుశ’లోని రావణుడి లాంటి జై పాత్రను పరిచయం చేస్తూ ఈ రోజు టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కనపడుతున్న తీరు పట్ల సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్ కొత్త సినిమా టీజర్‌పై స్పందిస్తూ... అందరితో 'వావ్' అనిపించేలా చేస్తూ తారక్ ఎంతో అద్భుతంగా పబ్లిసిటీ ప్రారంభించాడని పేర్కొన్నారు. ‘జై లవ కుశ’ టీజర్‌పై స్పందించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్... ‘జై లవకుశ సినిమాలోని జైని 'జవాన్' సినిమాలోని జై ఆహ్వానిస్తున్నాడు’ అని పేర్కొన్నాడు.