: మీ కోసమే... ‘జై’ వచ్చేశాడు: ఎన్టీఆర్ కొత్త సినిమా టీజర్ పై దేవిశ్రీ ప్రసాద్, నివేద థామస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జై లవ కుశ' టీజర్ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ‘ఇంట్రడ్యూసింగ్ జై’ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగులు, ఆయన కొత్త స్టైల్ పట్ల సినీ ప్రముఖులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ టీజర్ చూసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. జై వచ్చేశాడని, జై స్టైల్, డైలాగ్స్ అందరికీ నచ్చుతాయని పేర్కొన్నాడు.
ఈ టీజర్ పై స్పందించిన హీరోయిన్ నివేద థామస్ 'జై అందరి కోసం' అంటూ ట్వీట్ చేసింది. ఈ టీజర్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘కుమ్మేశావ్ అన్నా.. అదిరిపోయింది.. దటీజ్ ఎన్టీఆర్’ అంటూ కామెంట్లు పెడుతూ పండుగ చేసుకుంటున్నారు.