: `జై లవ కుశ` ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న `జై లవ కుశ` సినిమా ఫస్ట్ టీజర్ వచ్చేసింది. `ఇంట్రడ్యూసింగ్ జై` అంటూ విడుదల చేసిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది. బ్యాక్‌గ్రౌండ్‌లో రావణుడి విగ్రహం, `అసుర అసుర` అంటూ సాగే బీజీఎం ఎన్టీఆర్ `జై` పాత్రకి వన్నె తీసుకొచ్చాయి. `ఆ రావణుణ్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణుణ్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాల` అనే డైలాగ్‌ను ఈ టీజర్‌లో చూడొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.