: సూపర్ స్టార్ కృష్ణ జీవితంపై పుస్తకం విడుదల
సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోని వివిధ దశలు, సంఘటనల విశేషాలతో రచించిన `సూపర్ స్టార్@75` పుస్తకాన్ని తన భార్య విజయనిర్మలతో కలిసి కృష్ణ విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ కృష్ణ నటకౌశలాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అనంతరం అభిమానులు కృష్ణ, విజయనిర్మలలను గజమాలలతో సత్కరించారు.