: దలైలామా ఆశీస్సులను కోరిన చంద్రబాబు
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మత గురువు దలైలామా జన్మదినం నేడు. ఈ రోజు ఆయన 82వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికంగా స్ఫూర్తిని కలిగిస్తూ, మన జీవితాల్లో ఆయన వెలుగులు నింపుతూనే ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. పవిత్రమైన దలైలామా నుంచి ఆశీస్సులు కోరుకుంటున్నానని చెప్పారు.